టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ VS పాకిస్తాన్.. జోస్యం చెప్పిన బెన్ స్టోక్స్

by Shyam |
టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ VS పాకిస్తాన్.. జోస్యం చెప్పిన బెన్ స్టోక్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయాలను సాధించింది. శుక్రవారం దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌‌తో జరిగిన గ్రూప్-2 మ్యాచ్‌ చివర్లో ఆసిఫ్ అలీ నాలుగు సిక్సర్లు కొట్టి హ్యాట్రిక్ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో నవంబర్ 14న జరగనున్న ICC T20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో పాక్ ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సీనియర్లు అంటున్నారు. తాజాగా ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు తలపడతాయని స్టార్ ఆల్రౌండర్ ‘బెన్ స్టోక్స్’ అభిప్రాయం వ్యక్తం చేశారు.

టోర్నీ ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే చిరకాల ప్రత్యర్థి భారత్‌, న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌లను ఓడించి పాక్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే ఇంగ్లాడ్ జట్టు కూడా బంగ్లాదేశ్, వెస్ట్ ఇండీస్‌పై గెలవడంతో సెమీస్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ మాటలు హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా, స్టోక్స్ జోస్యం నిజమవుతుందో లేదో వేచిచూడాల్సిందే.

ఇదిలాఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడే ఆసిఫ్ అలీ (7 బంతుల్లో 25) 19వ ఓవర్‌లో కరీం జన్నత్ బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో పాకిస్తాన్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌తో పాకిస్తానీ బ్యాటర్‌ ఆసిఫ్ అలీ ఓ హార్డ్ హిట్టర్ అని బెన్ స్టోక్స్ తన ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు.

Advertisement

Next Story

Most Viewed