- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ సౌతాఫ్రికాలో ఏడు కరోనా కేసులు
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ)లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తున్నది. నాన్-కాంటాక్ట్ ఉండే ఆటలను తిరిగి దేశంలో ప్రారంభించాలంటే అందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సౌతాఫ్రికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఎస్‌ఏ తమ బోర్డుకు సంబంధించిన కాంట్రాక్టు క్రికెటర్లు, సిబ్బంది, ఇతర ఉద్యోగులు దాదాపు 100 మందికి కరోనా టెస్టులు చేయించింది. ఇందులో ఏడుగురికి కరోనా సోకినట్లు తేలింది. కాగా, వీళ్లు క్రికెటర్లా లేదా ఇతర సిబ్బందా అనే విషయం మాత్రం వెల్లడించలేదు. ‘ప్రభుత్వ ఆదేశానుసారం బోర్డు పరిధిలో ఉన్న 100మందికి కరోనా టెస్టులు చేయించాం. వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇది తక్కువ సంఖ్యే అని మేం భావిస్తున్నాం. దేశ వైద్యారోగ్యశాఖ నిబంధనల మేరకు వారి వివరాలను మేం బయటకు చెప్పలేం’ అని సీఎస్ఏకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ సోలో క్వినీ కరోనా బారిన పడ్డారు. ఆయన గత కొన్నేండ్లుగా గులియన్ బారే అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.