- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్సింగే : సంజీవ్
దిశ, స్పోర్ట్స్: టీవీల్లో చూసే అన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్సయే ఉంటాయని.. ఏ మ్యాచ్ కూడా సరిగా ఆడరని సంజీవ్ చావ్లా వెల్లడించాడు. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా అప్పటి కెప్టెన్ హన్సీ క్రోనేతో పాటు ఇతరులు ఫిక్సింగ్ చేశారనే ఆరోపణల్లో ప్రధాన నిందితుడైన సంజీవ్ చావ్లా ఢిల్లీ పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించాడు. క్రికెట్ ఫిక్సింగ్‌లో అండర్ వరల్డ్ చాలా ముఖ్య భూమిక పోషిస్తోందని.. వాళ్ల ప్రభావం క్రికెట్ మ్యాచ్‌లపై ఉందని సంజీవ్ చెప్పాడు. సంజీవ్ చావ్లా విచారణలో చెప్పిన పలు విషయాల ఆధారంగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాంగోపాల్ నాయక్ చార్జ్ షీట్ వేశారు. కాగా, ఆయనకు అండర్ వరల్డ్ నుంచి ప్రాణహాని ఉందని కూడా సంజీవ్ విచారణ సందర్భంగా లిఖిత పూర్వకంగా చెప్పడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన సంజీవ్ చాలా ఏండ్లుగా క్రికెట్ బుకీగా పని చేస్తున్నాడు. ఆ తర్వాత ఫిక్సింగ్ చేసే వరకు ఎదిగినట్లు పోలీసులు తెలిపారు. ఇండియాలో జరిగే ప్రతీ మ్యాచ్‌పై ఇతను బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంతకు మించి తాను ఏం చెప్పినా అండర్ వరల్డ్ తనను చంపేస్తుందని సంజీవ్ చెప్పాడు.