- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇది ‘ప్రియ’మైన సబ్బు!
“మీది పొడిగా ఉండే చర్మమా? అయితే ఈ సబ్బు వాడండి, లేదా జిడ్డుగా ఉండే చర్మమా? అయితే అది బాగుంటుంది” అంటూ చర్మసౌందర్య ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలు ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చి సతమతం చేస్తుంటాయి కదా! అయితే మన చర్మానికి సరిగ్గా సరిపడే సబ్బు ఏదో తెలుసుకోవడం ఎలా? ఈ సమస్యకు బెంగళూరుకు చెందిన ప్రియ మరిస్వామి దగ్గర పరిష్కారం ఉంది.
సోప్‌స్మిత్ పేరుతో ఆమె నడిపిస్తున్న కంపెనీ.. చర్మానికి సరిపడా సబ్బులను తయారుచేసి ఇవ్వడమే కాకుండా ఆసక్తి ఉన్నవారికి అవి ఎలా తయారుచేయాలో నేర్పించి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. 2012లో ప్రారంభించిన ఈ కంపెనీ ద్వారా ఇప్పటికి 1,000 మంది సబ్బుల తయారీ నేర్చుకుని సొంత వ్యాపారాలు పెట్టుకున్నారు.
నాలుగు గంటలు సాగే ఈ శిక్షణ కార్యక్రమంలో ముందు థియరీ పాఠాలు, తర్వాత ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఈ శిక్షణలో పాల్గొనేవారికి గతంలో ఎలాంటి అనుభవం లేకున్నా, కేవలం ఆసక్తి ఉంటే చాలని ప్రియ చెబుతున్నారు. శిక్షణ ఇవ్వడమే కాకుండా సబ్బులు తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు, ముడి సరుకు ఎక్కడ దొరకుతాయో కూడా చెబుతారు. దాదాపుగా మూలికలను బెంగళూరు రైతుల నుంచి, నూనెలను దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నుంచి తీసుకువస్తారు.
మార్కెట్లో అందుబాటులో ఉన్న సబ్బుల్లో కేవలం 10 శాతం మాత్రమే సహజ పద్ధతిలో తయారై రసాయనాలు లేకుండా ఉన్నాయి. కాబట్టి తాను సహజ పద్ధతిలో తయారు చేస్తున్న సబ్బులకు డిమాండ్ పెరుగుతోందని ప్రియ అన్నారు. వినియోగదారులకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు తనకు లాభాలు వస్తుండటం సంతోషంగా ఉందని ప్రియ తెలిపారు.
Read Also….
http://www.dishadaily.com/kapil-mishra-slames-aap/
http://www.dishadaily.com/actor-brahmaji-son-sanjay-s-o-pitta-katha-movie/