- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టపాసులు ఏ టైంలో పేల్చాలంటే..
దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో బాణాసంచా ఎప్పుడు కాల్చాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. శనివారం రాత్రి 8 గంటల నుంచి 10వరకు మాత్రమే అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా, ఎన్జీజీ సూచనల మేరకు గ్రీన్ కాకర్స్ మాత్రమే కాల్చాలని, పర్యావరణహితాన్ని కాపాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని స్పష్టంచేసింది.
ఇదిలాఉండగా, రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఈ నేపథ్యంలో టపాసులు పేల్చడం వలన వెలువడే పొగ ద్వారా కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తీవ్రతరమవుతాయనే ఉద్దేశంతో ముందస్తుగా హైకోర్టు బాణాసంచా విక్రయాలపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. కాగా, వ్యాపారస్తుల వినతి మేరకు సుప్రీం హైకోర్టు తీర్పుపై స్టే విధించడమే కాకుండా, ఎన్జీటీ సూచనల మేరకు గ్రీన్ కాకర్స్ విక్రయానికి అనుమతులిచ్చింది.