- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అపరిచితుడి పాత్రలో కేసీఆర్.. సీపీఎం నేత జూలకంటి ఆగ్రహం
దిశ, మిర్యాలగూడ: ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతూ.. రాష్ట్రంలో అపరిచితుడి పాత్ర పోషిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం ఆఫీసులో రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభించి నెలరోజులు కావస్తున్నా పూర్తిస్థాయిలో ఐకేపీ కేంద్రాలు అందుబాటులో లేక రైతులు మిల్లర్లను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు.
రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతూ.. రైతులను అయోమయానికి గురిచేయడం సరికాదన్నారు. వరి సాగు చేస్తే ఉరే అని చెప్పే ప్రభుత్వాలను, రాబోయే రోజుల్లో రైతులు ఉరి తీస్తారని హెచ్చరించారు. యాసంగిలో సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిల్లర్ల సమన్వయంతో వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు నూకల జగదీష్ చంద్ర, రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, వేములపల్లి వైస్ ఎంపీపీ గోవర్ధన్, పాదూరి శశిధర్ రెడ్డి, బావండ్ల పాండు, పరుశరాములు, రాంచంద్రు, బాబు నాయక్, పతాని శ్రీను పాల్గొన్నారు.