టీఆర్ఎస్ కొత్త పథకాల గుట్టురట్టు చేసిన సీపీఎం నేత

by Shyam |
CPM leader Julakanti Rangareddy
X

దిశ, నేరేడుచర్ల: రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాలు రూపొందిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రెడ్డి విమర్శించారు. శనివారం నేరేడుచర్ల పట్టణంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్టాడుతూ… ప్రభుత్వం విలువైన భూములను కాపాడాల్సింది పోయి, అమ్ముకుంటూ ప్రజా సంపదను దోచుకుంటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చుతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి పథకాల అనే అస్త్రాలు ఉపయోగిస్తూ, ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ధీరావత్ రవినాయక్, శ్రీరాములు, యాదగిరి రావు, ముల్కలపల్లి రాములు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల కార్యదర్శులు కె.నగేష్, అనంత ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story