రేషన్ కార్డుల ఎంపికలో కూడా రాజకీయ జోక్యం ఏంటి?

by Shyam |
CPM leader Jahangir
X

దిశ, భువనగిరి రూరల్: ఈనెల 26 తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించనున్న రేషన్ కార్డుల ప్రక్రియలో రాజకీయ జోక్యం లేకుండా, నివారించాలని సీపీఐ(ఎం) యాదాద్రి-భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం వలిగొండ మండల పరిధిలోని పైల్వాన్‌పురం గ్రామంలో సీపీఐ(ఎం) నిర్వహించిన సమావేశంలో జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ… వాస్తవమైన లబ్ధిదారులను గుర్తించి, రేషన్ కార్డులు అందజేయాలని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ కార్యకర్తలకే రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డుల ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా గ్రామసభల ఎంపిక చేయాలని సూచించారు.

హామీ ఇచ్చిన విధంగా 57 ఏండ్లు నిండిన అందరికీ నూతన పెన్షన్ ఇవ్వాలని అన్నారు. అంతేగాకుండా.. అకాల వర్షాల కారణంగా పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి సీపీఐ నాయకులు చీర్క శ్రీశైలం రెడ్డి, మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి, తుర్కపల్లి సురేందర్, మామిడి వెంకట్ రెడ్డి, బొడ్డుపల్లి భిక్షపతి, రాగిరు కృష్ణస్వామి, రేపాక ముత్యాలు, బంధారపు ధనంజయ, వట్టిపెళ్లి చంద్రయ్య, వనగంటి స్వామి, బండారు మైసమ్మ, బండారు యాదయ్య, చీర్క లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed