- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘ప్రత్యేక హోదా కోసం ఆ ఎంపీలు రాజీనామా చేయాలి’
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత సీఎం జగన్ మాట మార్చి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన ఏడేళ్ల కాలంలో ఏపీకి అడుగడుగునా ద్రోహం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. వైసీపీ, టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి నరేంద్రమోడీ ఏపీకి చేసిన మోసం బట్టబయలవుతుందని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సాధనకై ఇప్పటికైనా సీఎం జగన్ నడుం కట్టాలని రామకృష్ణ సూచించారు.