అది మోడీ ప్రభుత్వ వినాశకర చర్య: సీపీఐ నేత రాజా

by srinivas |
అది మోడీ ప్రభుత్వ వినాశకర చర్య: సీపీఐ నేత రాజా
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మోడీ ప్రభుత్వ వినాశక చర్య అని సీపీఐ సీనియర్ నేత డి.రాజా వ్యాఖ్యానించారు. 100శాతం పెట్టుబడులు ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే లక్షల కోట్ల విలువ గల భూమి కూడా లాక్కుంటుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని పునర్ పరిశీలించాలని కోరుతోందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story