- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాకి అస్వస్థత

X
దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అస్వస్థతకు గురయ్యారు. శనివారం సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాజా షుగర్ లెవెల్స్ పడిపోవడంతో సమావేశంలోనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు రాజాను కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు రెండ్రోజులు జరుగనుండగా, మొదటి రోజు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల కోసం దేశవ్యాప్తంగా సీపీఐ జాతీయ నాయకులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
Next Story