బిగ్‌బాస్ షోను రద్దు చేయాలి: సీపీఐ నారాయణ

by srinivas |   ( Updated:2021-09-25 06:10:55.0  )
బిగ్‌బాస్ షోను రద్దు చేయాలి: సీపీఐ నారాయణ
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 27 న నిర్వహించబోయే భారత్ బంద్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ పాల్గొనాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. సేవ్ ఇండియా – మోడీ హటావో నినాదం పేరుతో భారత్ బంద్ నిర్వహిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మాటీవిలో ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బూతులు తిట్టుకోవడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. దేశంలోని పోర్టులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా డ్రగ్స్, స్మగ్లింగ్ ఎక్కువై దేశానికి ముప్పు ఏర్పడుతుందని నారాయణ అన్నారు. భారత్ బంద్ లో రాష్ట్ర ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story