సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి కారు ధ్వంసం

by Anukaran |   ( Updated:2020-09-13 11:59:48.0  )
సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి కారు ధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంపై ఆదివారం సాయంత్రం 6.30గంటలకు దాడి జరిగింది. పార్టీ కార్యాలయం ముందు నిలిపి ఉంచిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కారు అద్దాలను కూడా ఆకతాయిలు ధ్వంసం చేసి పరారయ్యారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు అక్కడున్నవారు చెబుతున్నారు. ఘటనపై చాడా వెంకటరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేయగా నారాయణగూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారును ధ్వంసం చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. లోతైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story