- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 23 ఏళ్లా.. చాడ వెంకట్ రెడ్డి ఫైర్
దిశ, మోత్కూరు: దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న బునాదిగాని కాల్వను త్వరితగతిన పూర్తి చేయాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన బునాదిగాని కాల్వను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం మొత్తం 98 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌లో కేవలం 53 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసిందని, 35 కి.మీ పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దాదాపు 23 ఏళ్లుగా ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉండడం శోచనీయం అన్నారు. కేవలం 98 కిలోమీటర్ల బునాదిగాని కాల్వ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 23 ఏళ్లు పట్టడం చూస్తే అసలు మనం ఏ దేశంలో ఉన్నామో అని సందేహం కలుగుతోందని ఎద్దేవా చేశారు.
కేవలం రూ.95 కోట్ల నిధులతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ పనులు.. నిర్లక్ష్యం చేసి భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారుతున్నా.. కొద్ది కాల్వ పనులు మార్పులు చేర్పులతో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బునాదిగాని కాల్వను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక చేశారు.