- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘బీజేపీ నేతలకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు’
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఈనెల 5వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు సంబంధించిన పోస్టర్‌కు మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. పోలీసులు, వాలంటీర్లు, డబ్బులతో ఎన్నికల్లో గెలుస్తున్నారని ఆరోపించారు. ఎవరు నామినేషన్ వేయాలో, ఎవరు విత్‌డ్రా చేయాలో పోలీసులే ఆదేశిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి ఓట్లు వేయకుంటే సంక్షేమ పథకాలు పోతాయని బెదిరింపులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. అంతేగాకుండా విశాఖలో విత్‌డ్రా చేసుకుంటే ఎంపీ విజయసాయిరెడ్డి రూ.కోటి ఆఫర్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్తే ప్రధాని మోడీ వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.