మెరుగైన సమాజ నిర్మాణానికి ‘సంఘమిత్ర’

by Shyam |
మెరుగైన సమాజ నిర్మాణానికి ‘సంఘమిత్ర’
X

దిశ, క్రైమ్‌బ్యూరో: సమాజంలో పోలీసింగ్ పట్ల అపోహలను తొలగించడమే కాకుండా, పౌరులు, పోలీసులకు అంతరాలను తగ్గించడమే లక్ష్యంగా ‘సంఘమిత్ర’ దోహదపడుతోందని వక్తలు పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల సమస్యల పరిష్కారానికి సంఘమిత్ర ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. అమల అక్కినేని, నమత్రా శిరోద్కర్, ఎలికో లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ వనితా దాట్ల, సీపీ సజ్జనార్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా అక్కినేని అమల మాట్లాడుతూ లాక్‌డౌన్ నేపథ్యంలో విధుల నిర్వహణ ఇంటి నుంచే నిర్వహిస్తున్నందున గృహహింస, ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పోలీసులకు, ప్రజలకు మధ్యనున్న అంతరాలను తగ్గించేందుకు ప్రత్యేక వారథి అవసరమని ఆ వారథే సంఘమిత్ర కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నమ్రతా శిరోద్కర్ మాట్లాడుతూ అనేకమంది బాధితులు స్నేహహస్తం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇంట్లో అమ్మాయిలను, అబ్బాయిలను సమానంగా పెంచాలని సూచించారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ సమాజంలో ఎవరికీ ఏ అవసరమో తెలుసుకుని, ఆ సమస్యల పరిష్కారానికి సంఘమిత్ర పనిచేస్తోందని అన్నారు. ఆసక్తి కలిగిన స్త్రీ, పురుషులకు సంఘమిత్రులుగా ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వాలంటీర్లుగా చేరేందుకు ఈ నెల 10లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా సంఘమిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed