- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏఎస్ఐ కుటుంబానికి అండగా ఉంటాం.. సీపీ మహేష్ భగవత్
దిశ, జవహర్ నగర్: విధి నిర్వహణలో గుండె పోటుతో మరణించిన అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీతారామరాజు కుటుంబానికి అండగా ఉంటామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు శనివారం నేరేడ్ మెట్ ఆఫీస్ లో సీతారామరాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజపేట పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పి. సీతారామరాజు జూన్ 16న చెక్ పోస్ట్ వద్ద డ్యూటీలో ఉండి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.
అనంతరం డీజీపీ ఆదేశాల మేరకు సీతారామరాజు భార్య మమతకు రూ. 4 లక్షల 61వేల చెక్కును సీపీ మహేష్ భగవత్ అందజేశారు. ఇందులో భద్రత నిధుల కోసం రూ.3 లక్షల 92 వేల 41 చెక్కు, విడో ఫండ్ ద్వారా రూ. 10 వేల చెక్కు, ఫ్లాగ్ ఫండ్ రూ. 10 వేల చెక్కు, కార్పస్ ఫండ్ ద్వారా రూ.49వేల 8 వందల చెక్కులుగా సమకూర్చారు. దీంతో పాటూ సీపీ మహేష్ భగవత్ సిపార్సు మేరకు భద్రత నుండి ప్లాట్ లోన్ గా తీసుకొన్న రూ.3లక్షల 60 వేలను డీజీపి మాఫీ చేస్తూ ప్లాట్ డాకుమెంట్లను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డీసీపీ అడ్మిన్ శిల్పవల్లి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.