సైబర్ నేరగాళ్ల‎తో జాగ్రత్త: సీపీ జోయల్ డేవిస్

by Shyam |   ( Updated:2020-04-04 06:45:00.0  )
సైబర్ నేరగాళ్ల‎తో జాగ్రత్త: సీపీ జోయల్ డేవిస్
X

దిశ, మెదక్: సగం జీతాలే వచ్చాయి.. మరి మీ బ్యాంకు లోన్‎పై ఉన్న ఈఎంఐ వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ ఖాతా వివరాలు చెప్పండి అంటూ వల వేస్తున్న సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు. బ్యాంకు అకౌంట్ వివరాలను ఎవరు అడిగినా ఎలాంటి సమాచారం చెప్పవద్దన్నారు. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మాయం చేస్తారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కవద్దని సీపీ జోయల్ డేవిస్ సూచించారు.

Tags: CP Joel Davis, comments, Beware with Cyber criminals

Next Story

Most Viewed