తిరుమలలో 14 మంది సిబ్బంది పై టీటీడీ చర్యలు.. కారణం ఇదే!

by Jakkula Mamatha |
తిరుమలలో 14 మంది సిబ్బంది పై టీటీడీ చర్యలు.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో భక్తులు(Devotees) ఎంతో భక్తితో, నిష్టగా పూజా కార్యక్రమాలు చేస్తారు. అలాంటి తిరుమలలో నిన్న(శనివారం) అపచారం జరిగింది. ముగ్గురు భక్తులు పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్తుండడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించిన భద్రతా సిబ్బంది.. వారిని అక్కడే అడ్డుకున్నారు. అయితే ఈ ఘటన పై తాజాగా టీటీడీ(TTD) ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో పాదరక్షలతో ఆలయ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు తెల్లరంగు కలిగిన డిస్‌పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. తమ విధులను సమర్థంగా నిర్వహించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు ఆదేశాల మేరకు.. ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు.

సస్పెండ్ అయిన టీటీడీ సిబ్బంది: ఇద్దరు

చక్రపాణి (సీనియర్ అసిస్టెంట్)

వాసు (జూనియర్ అసిస్టెంట్)

సస్పెండ్ అయిన టీటీడీ భద్రతా సిబ్బంది – 5 మంది:

డి. బాలకృష్ణ, PSG: 0807

వసుమతి, CWPSG: 514067

టి. రాజేష్ కుమార్, AWPO: 512475

కె. వెంకటేష్, PSG: 932

ఎం. బాబు, AWPO

సస్పెన్షన్‌కు ప్రతిపాదించబడిన ఎస్పీఎఫ్ సిబ్బంది – 6 మంది:

సి. రమణయ్య, ASI: 1101 (ఇన్‌ఛార్జ్)

బి. నీలబాబు, CT: 3595

డి.ఎస్.కె. ప్రసన్న, CT: 3602

చ. సత్యనారాయణ, ASI: 696

పోలి నాయుడు, CT: 3516

Next Story

Most Viewed