- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నకిలీ విత్తనాల పట్టివేత కేసుపై సీపీ వివరణ
దిశ, హైదరాబాద్: నకిలీ విత్తనాలను విక్రయించే ముఠాను ఎల్బీనగర్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక డీసీఎం, రూ.50 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ చేసే కవర్లు, పెయింటింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు.
జోగులాంబ గద్వాల జిల్లా వాడేపల్లి మండలం శాంతి నగర్‌కు చెందిన మన్యం లక్ష్మీనారాయణ.. ప్రస్తుతం మన్సూరాబాద్ కమలానగర్ కాలనీలోని సహారా ఎస్టేట్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే, 1966 విత్తనాల తయారీ, అమ్మకాల చట్ట ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇతను మూడు సంవత్సరాలుగా తపస్య, అగ్రో టెక్ తరహాలో ఉప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో నిషేధిత బీటీ -3 పత్తి విత్తనాల తయారీ ప్రాసెస్ యూనిట్‌ను ఏర్పాటు చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం నుంచి విత్తనాలను కొనుగోలు చేసి, తన ప్రాసెస్ యూనిట్‌లో రీప్రాసెసింగ్ చేసి బహిరంగ మార్కెట్లలో ప్రముఖ బ్రాండ్ల పేర్లతో కవర్లలో నింపి విక్రయాలు జరుపుతున్నాడు.
మళ్ళీ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నిషేధించిన బీటీ -3 పత్తి విత్తనాన్ని కర్నూలు జిల్లా నంద్యాల హుస్సేన్ సాహెబ్ నుంచి సేకరించాడు. ఆ తర్వాత తన ప్రాసెసింగ్ యూనిట్‌లో విత్తనాన్ని వివిధ రకాల బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేశాడు. అనంతరం ప్యాకింగ్ చేసిన ఈ నకిలీ విత్తనాలను అమ్మకాలు చేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యలో అధికారులు పట్టుకున్నట్లు సీపీ వివరించారు. ఈ కేసులో మన్యం మన్యం లక్ష్మీనారాయణ (ఏ1), డీసీఎం డ్రైవర్ పింజారి యూసిఫ్ బాబు (ఏ2), డీసీఎం క్లినర్ మాల దాసరి సురేష్ (ఏ3), వెంపటి బాచి (ఏ4)లుగా గుర్తించామన్నారు. నిందితులకు నకిలీ విత్తనాలను అమ్మిన హుస్సేన్ సాహెబ్ (ఏ5) పరారీ ఉన్నట్టు మహేష్ భగవత్ తెలిపారు.