- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కిడ్నాప్ వెనుక భూమా అఖిలప్రియ హస్తం: సీపీ
దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో భూమా అఖిల ప్రియ హస్తం ఉందని సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. భార్యాభర్తలిద్దరూ కలిసి కిడ్నాప్ వ్యవహారం సాగించారన్నారు. తొలుత నకిలీ సెర్చ్ వారెంట్ చూపించిన 10 మంది దుండగులు.. ఐటీ అధికారులమంటూ ఇంట్లో చొరబడి హడావిడి చేశారన్నారు. హఫీజ్‌పేటలో భూవివాదం నేపథ్యంలోనే కిడ్నాప్‌కు ప్లాన్ వేశారని సీపీ తెలిపారు. కిడ్నాప్ చేసిన వెంటనే ప్రవీణ్ రావు అతని సోదరులను సిటీ దాటించే ప్రయత్నంలోనే పోలీసులు పట్టుకున్నారన్నారు. మొత్తం 15 పోలీసు బృందాలు గాలింపు చేపట్టి కిడ్నాపర్లను అరెస్ట్ చేశామని సీపీ గుర్తు చేశారు. ఈ కేసులో సీసీ ఫుటేజీ ఎంతో సాహాయపడిందని అంజనీకుమార్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసి ఏవీ సుబ్బారెడ్డి ప్రధాన నిందితుడి(A1)గా గుర్తించామన్నారు. A2గా భూమా అఖిలప్రియ, A3గా భార్గవ్‌రామ్ ఉన్నారని సీపీ వెల్లడించారు. ఇందులో మిగతావారి హస్తం కూడా ఉందని త్వరలోనే అందరినీ అరెస్ట్ చేస్తామని అంజనీకుమార్ స్పష్టం చేశారు.