- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గో హత్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు
లక్నో: భారత సంస్కృతిలో కీలక పాత్ర పోషించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ప్రాథమిక హక్కుల్లో గోసంరక్షణను కూడా చేర్చాలని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. గోవధ నిరోధక చట్టం కింద అరెస్టయిన జావెద్ అనే వ్యక్తి, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ శేఖర్ కుమార్ వ్యాఖ్యానిస్తూ.. ‘గోసంరక్షణను ఒక్క మతానికే పరిమితం చేయొద్దు. భారత సంస్కృతిలో ఆవు కూడా ఒక భాగం. కావున, మతాలకతీతంగా భారత సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడికీ ఉంటుంది’ అని తెలిపారు.
సంస్కృతి, నమ్మకాలు దెబ్బతింటే దేశం బలహీనమవుతుందని వెల్లడించారు. ‘ఆవును పూజిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఆవులకు ప్రాథమిక హక్కులు కల్పించేందుకు భారత ప్రభుత్వం బిల్లు తీసుకురావాలని సూచించారు. ప్రపంచం మొత్తంలో వివిధ మతాల ప్రజలు నివసించేది భారత్‌లో మాత్రమేనని, వారి ఆరాధన విభిన్నం కావొచ్చేమోగానీ, దేశం విషయానికొస్తే మాత్రం అందరి ఆలోచనా ఒకటేనని వెల్లడించారు. అలాగే, యూపీలో గోశాలల నిర్వహణ తీరుపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గోవధ నిరోధక చట్టం కింద అరెస్టయిన నిందితుడికి బెయిల్ నిరాకరించారు. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే మళ్లీ అదే పనిచేస్తాడని, దీంతో సమాజంలో సామరస్యం దెబ్బతినే అవకాశముందని అభిప్రాయపడ్డారు.