రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. కోవిషీల్డ్ టీకా ధర తగ్గించిన ‘సీరం’

by vinod kumar |   ( Updated:2021-04-28 09:45:07.0  )
రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. కోవిషీల్డ్ టీకా ధర తగ్గించిన ‘సీరం’
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలైన భారత్ బయోటెక్, సీరం కంపెనీలతో కేంద్రం సమావేశమై ప్రొడక్టివిటీని త్వరితగతిన పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే టీకాల ధరలను ఆయా కంపెనీలు ప్రకటించాయి. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400 చొప్పున అందజేయనున్నట్లు ప్రకటన వెలువడటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అసహనం వ్యక్తం చేశాయి.

కేంద్రానికి ఒక రేటు, తమకు ఒక రేటు ఎంటనీ.. ఈ విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలోనే తాజాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రూ.300లకే అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందజేయనున్నట్లు కంపెనీ సీఈవో అదర్ పూనావాలా బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తగ్గించిన ధర తక్షణమే అమలులోకి వస్తుందన్నారు.

Advertisement

Next Story