Covid Warriors: ‘కొవిడ్ వారియర్స్ సేవలు అభినందనీయం’

by Shyam |   ( Updated:2021-05-24 07:30:11.0  )
Covid Warriors: ‘కొవిడ్ వారియర్స్ సేవలు అభినందనీయం’
X

దిశ, ఆమనగల్లు : కరోనా మహమ్మరికి భయపడకుండా ప్రజల ప్రాణాల కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టుల సేవలు అభినందనీయమని ఆమనగల్లు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మండ్లి రాములు అన్నారు. ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, ప్రయాణీకులకు, వృద్ధులకు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండ్లి రాములు మాట్లాడుతూ లాక్‌డౌన్ ముగిసే వరకు ఉచిత భోజన వసతి ఉంటుందన్నారు. కరోనా మహమ్మరి నిర్మూలనకు ముందు జాగ్రత్త చర్యలే ఏకైక మార్గమన్నారు.

ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. కరోనా వైరస్ నిరోధించడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. మందు లేని కరోనాను ముందు జాగ్రత్త చర్యలతోనే నిర్మూలించవచ్చునని, అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలన్నారు. నాయకులు కిషన్ నాయక్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి అలీమ్, కొప్పు రాఘవేందర్, శ్రీను, శేఖర్ రెడ్డి, రామకృష్ణ, రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story