భారత్‌లో కరోనా ‌@ 66,999

దిశ, వెబ్ డెస్క్ :
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 66,999 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 942 మంది వైరస్ తో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిసి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 23,96,638కి చేరింది.

ఇందులో 16,95,982 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్చి అయ్యారు. భారత్‌లో మరో 6.53,622 యాక్టివ్ కేసులున్నాయి. తాజా మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 47,033కు చేరింది. అయితే, గడచిన 24గంటల్లో 8,30,391 టెస్టులు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 2,68,45,688కు చేరింది.

Advertisement