- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుర్గగుడికి కరోనా ఎఫెక్ట్.. అమ్మవారి దర్శనంపై కొత్త ఆంక్షలు
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దుర్గగుడి అధికారులు ప్రత్యేక ప్లాన్ రూపొందించారు. అమ్మవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. దుర్గగుడిలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా ఉత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకు 10 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
గతంలో రోజుకు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల హెచ్చరికల నేపథ్యంలో రోజుకు పదివేల మందిని మాత్రమే అనుమతించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉచిత దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఒక్క రూపాయి చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. భవానీ దీక్ష చేపట్టే భక్తులు అధికంగా వస్తున్నందున ఇరుముడికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం దర్శనానికి మాత్రమే అనుమతి కల్పిస్తామని వివరించారు.