- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనాతో మారిన ‘హజ్’ దృశ్యం

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన కూటమిలో హజ్ ఒక్కటి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు సౌదీలోని మక్కాకు తరలివెళ్లేవారు. మక్కాలోని భారీ మసీదులో రద్దీగా కదిలేవారు. ‘కాబా’ చుట్టూ కిక్కిరిసన పంక్తిలో ప్రదక్షిణలు చేసేవారు. కానీ, ఈసారి కరోనా మహమ్మారి ఈ దృశ్యాన్ని మార్చేసింది.
వైరస్ ప్రబలకుండా యాత్రికుల సంఖ్యను కుదించడంతో ‘కాబా’ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నవారూ భౌతికదూరాన్ని పాటించారు. తెల్లటి దుస్తులు ధరించిన భక్తులు మాస్కులు వేసుకుని ఎండ నుంచి రక్షణగా గొడుగు పట్టుకుని ప్రదక్షిణలు చేస్తున్న అరుదైన దృశ్యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతేడాది 25 లక్షల మంది హజ్‌యాత్రలో పాల్గొంటే నేడు పదివేల మందికి మాత్రమే అనుమతి దక్కింది. కరోనా కారణంగా భక్తుల సంఖ్యను తగ్గించినప్పటికీ ఈ యాత్ర కోసం అధికారయంత్రాంగం రెట్టింపు శ్రమపడుతున్నదని కింగ్ సల్మాన్ అన్నారు.