కరోనా వల్ల 8.1 కోట్ల ఉద్యోగాలు పోయాయి : ఐఎల్ఓ!

by Harish |
కరోనా వల్ల 8.1 కోట్ల ఉద్యోగాలు పోయాయి : ఐఎల్ఓ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం వల్ల పని గంటల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో సుమారు 8.1 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) నివేదిక వెల్లడించింది. ‘ఈ ఏడాది కరోనా కారణంగా ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. పలు దేశాల్లో సామాజిక భద్రత తగ్గిపోవడం, వ్యవస్థాపరమైన సామర్థ్యాలు క్షీణించడం గమనించాం. ఈ పరిణామాలతో వ్యాపార సంస్థలు కొనసాగేందుకు, కార్మికులు నిలదొక్కుకునేందుకు అవసరమైన సాయం చేసేందుకు వీలవలేదు’ అని ఐఎల్ఓ ఆసియా-ఫసిఫిక్ విభాగం డైరెక్టర్ చిహొకో అసడా చెప్పారు.

ఆసియా-పసిఫిక్ విభాగంలో గతేడాదితో పోల్చినపుడు 4.2 శాతం ఉద్యోగాలు తగ్గిపోయాయి. వీటిలో మహిళల్లో ఎక్కువగా 4.6 శాతం తగ్గుదల ఉండగా, పురుషుల్లో 4 శాతం ఉందని ఐఎల్ఓ నివేదిక వివరించింది. ఉద్యోగాలను కోల్పోయిన వారిలో ఎక్కువగా యువతే ఉన్నారని, కొందరు పని గంటలను పోగొట్టుకున్నారు. అలాగే, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కార్మికుల ఆదాయం 9.9 శాతం తగ్గిపోయింది. తర్వాత ఇది 3.4 శాతం తగ్గినట్టు తేలిందని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story