- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సీరం’ బాటలో ‘భారత్ బయోటెక్’.. కోవాగ్జిన్ టీకా ధర తగ్గింపు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతంలో కేంద్రానికి రూ.150, అన్ని రాష్ట్రాలకు రూ.600 విక్రయించిన కోవాగ్జిన్ టీకా ధరను ప్రస్తుతం రూ.400గా నిర్ణయిస్తూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటిక్ సంస్థ శుక్రవారం ప్రకటించింది. కేంద్రానికి తక్కువ ధరకు టీకాను అందించి రాష్ర్టాలకు ఎక్కువ ధరకు టీకా అందజేయడంపై బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు అసహనం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే మొన్న సీరం కంపెనీ సీఈవో అదర్ పూనావాలా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను రూ.400 నుంచి 300లకు తగ్గిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సీరం కంపెనీ బాటలోనే ప్రస్తుతం భారత్ బయోటెక్ కంపెనీ కూడా రూ.600లుగా ఉన్న కోవాగ్జిన్ టీకా ధరను రూ.400లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం వలన దేశ ప్రజలకు కొవిడ్ టీకా తక్కువ ధరకే అందుబాటులోనికి రానుంది. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ ప్రజలకు ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించడంతో ఆయా ప్రభుత్వాలపై ఆర్థిక భారం కొంత మేర తగ్గనుంది.