దారుణం: మచిలీపట్నంలో కోవాగ్జిన్ టీకాలు మాయం

by srinivas |   ( Updated:2021-05-17 04:08:35.0  )
Covaxin vaccine
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కోవాగ్జిన్ టీకాలు మాయం అయ్యాయి. ఈ ఘటన బందర్‌లోని నారాయణపురం అర్బన్ హెల్త్ సెంటర్‌లో సోమవారం చోటుచేసుకుంది. దాదాపు 40 కోవాగ్జిన్ డోసులు కనిపించడంలేదని హెల్త్ ఆఫీసర్ అమృత స్థానిక చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఏపీవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో టీకాలు మాయం కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story