- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికతో అసభ్య ప్రవర్తన.. కోర్టు సీరియస్
దిశ, వెబ్‌డెస్క్ : ఐదేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు బెయిల్ నిరాకరించింది. బాలిక చిన్నది అయినప్పటికీ, ఆమెకు “గుడ్ టచ్, బ్యాడ్ టచ్” గురించి తెలియదని చెప్పలేమని న్యాయస్థానం పేర్కొన్నది. బాలిక ఇంట్లో ఆడుకుంటున్న సమయంతో ఇంటి పక్కన ఉండే వ్యక్తి వచ్చి బాలికను దగ్గరకు తీసుకోని అసభ్యంగా తాకినట్లు కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 354 (వేధింపు), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద ఆయనపై కేసు నమోదైంది.
దీనిపై ఈనెల 6న పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి భారతి కాలే విచారణ చేపట్టారు. సాక్షులను విచారించిన న్యాయమూర్తి.. నిందితుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు గుర్తించారు. బాలిక చిన్నది అయినప్పటికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసని ప్రాసిక్యూషన్ వాదించింది. దాని గురించి ప్రత్యేకంగా స్టేట్మెంట్లో చెప్పింది. ప్రాసిక్యూషన్ వాదనలలో మెరిట్లను కనుగొన్న కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ” నిందితుడిపై మోపిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. దరఖాస్తుదారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని న్యాయమూర్తి అన్నారు. ఈ పరిస్థితులలో, దరఖాస్తుదారుడు బెయిల్ పొందటానికి అనర్హుడని తీర్పు చెప్పింది. కాగా ఈ తీర్పు ఫిబ్రవరి 6న వెలుబడగా.. మంగళవారం విడుదల చేశారు.