- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గద్వాల రైల్వేట్రాక్స్‌పై విగతజీవులుగా యువజంట.. హత్యా.. ఆత్మహత్యా..?
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. రైల్వేట్రాక్స్‌పై యువజంట విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పట్టణంలోని పిల్లిగుండ్ల ఆటోనగర్ సమీపంలోని రైల్వేట్రాక్స్ పై వెలుగుచూడగా స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన గంగాధర్, లక్ష్మి అనే యువజంట రైలు పట్టాలపై విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
అప్పటికే గంగాధర్ ప్రాణాలు కోల్పోయి ఉండగా, తీవ్రగాయాలతో ఉన్న లక్ష్మిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించినట్లు సమాచారం. అయితే, యువతికి ఇదివరకే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఈ యువజంట ఆత్మహత్య చేసుకున్నారా..? లేదా ఎవరైనా హత్య చేసి రైలు పట్టాలపై పడవేశారా..? అనే అంశాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ మేరకు గద్వాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.