- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శివుడి దర్శనానికి వెళ్తూ.. నవజంట దుర్మరణం
దిశ, వెబ్‌డెస్క్ : శివరాత్రి రోజే నవదంపతులు శివైఖ్యం చెందారు. ఆది దేవుడి దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు వెళ్లారు. ఒక్కపొద్దు ఉండి.. జాగారం చేసి శివుడి మెప్పు పొందాలనుకున్న ఆ జంట వాటిని ఆచరించకుండనే శివుడి నివాస స్థలానికి వెళ్లారు. పెళ్లై మూడు నెలలు నిండక ముందే రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోరకొండకు చెందిన జాటోతు లక్ష్మణ్ (30) పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు మూడు నెలల క్రితమే మంగా (22) అనే యువతితో వివాహం అయింది. గురువారం శివరాత్రి పండగను పురస్కరించుకుని ఇంట్లో పూజ చేసుకున్నారు. అనంతరం గ్రామంలోని శివాలయంలో పూజలు చేశారు. అనంతరం చారిత్రక నేపథ్యం ఉన్న నల్లగొండ జిల్లాలోని రాచకొండ శివాలయానికి బైక్‌పై బయలుదేరారు. బైక్.. జపాల గ్రామ సమీపంలోకి రాగానే మూల మలుపు వద్ద స్లిప్ అయ్యి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న మంచాల ఎస్ఐ సురేష్ ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు అప్పటికే మృతి చెందడంతో పోస్ట్ మార్టానికి తరలించారు. కాగా పెళ్లైన మూడు నెలలకే నవ దంపతులు మృతి చెందడంలో రెండు కుటుంబాల్లో విషాధం నెలకొంది. మృతదేహాలను చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.