- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ సీబీఐ అధికారులు అరెస్ట్.. భారీగా బంగారం, నగదు స్వాధీనం
దిశ, శేరిలింగంపల్లి: ఐటీ అధికారులం అంటూ హల్చల్ చేసి మూడు కేజీల బంగారం, రూ.2 లక్షలతో ఉడాయించిన కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీ సీ బ్లాక్ లో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంటికి ఈనెల 15న మధ్యాహ్నం ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. ఐటీ అధికారులమంటూ తనిఖీల పేరిట ఇళ్లంతా శోధించారు. భాగ్యలక్ష్మి వద్ద లాకర్ తాళాలు తీసుకొని అందులోని మూడు కిలోల బంగారం, డబ్బుతో అక్కడి నుంచి పారిపోయారు. తనకు ఎలాంటి వివరాలు చెప్పకపోవడం, తీసుకెళ్తున్న నగదు వివరాలు అందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు వేట ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా గాలించారు. వారిని ఆంధ్రప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. నిందితులు పశ్చిమ గోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. మొత్తం ఆరుగురు ఈ చోరీకి పాల్పడగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల వద్ద నుండి చోరీకి గురైన సొత్తు స్వాధీనం చేసుకుని మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ చోరీకి రెండు నెలల నుంచి స్కెచ్ వేసినట్లు సమాచారం.