- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలింగ్ బూత్‌లో కార్పొరేటర్ భర్త హల్‌చల్
దిశ ప్రతినిధి, మేడ్చల్ : పోలింగ్ బూత్ కార్పొరేటర్ భర్త హల్ చల్ సృష్టించాడు. అనుచరులతో కలిసి పోలింగ్ బూత్ లోకి చొరపడ్డాడు. అడ్డకున్న పోలీసుల పట్ట దురుసుగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్లితే.. మల్కాజిగిరి నియోజకవర్గం, అల్వాల్ సర్కిల్ భూదేవి నగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. అయితే టీఆర్ఎస్ నాయకులు పార్టీ రంగు ధరించిన టీషర్టులు ధరించి బూత్ లోకి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం కార్పొరేటర్ సబితా భర్త అనిల్ కిషోర్ గౌడ్ తన అనుచరులతో కలిసి బలవంతంగా బూత్ లోకి చొచ్చుకొని వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీషర్టులతో లోపలికి రావడంపై మిగతా అభ్యర్థుల ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరులమంటూ పోలింగ్ సిబ్బందితో గొడవకు దిగారు. అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐ కార్పొరేటర్ భర్త అనిల్ కిషోర్ గౌడ్ ను వెళ్లిపోవాలని సూచించడంతో.. సదరు ఎస్సైపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.