కార్పొరేట్ ఆదాయాలు క్షీణించాయి : ఇక్రా!

by Harish |
కార్పొరేట్ ఆదాయాలు క్షీణించాయి : ఇక్రా!
X

దిశ, వెబ్‌డెస్క్: బలహీనమైన ఆర్థిక వాతావరణం కారణంగా కార్పొరేట్ ఆదాయాలు (Corporate earnings) గత మూడు త్రైమాసికాలుగా పడిపోతున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (Rating agency Icra) వెల్లడించింది. కొవిడ్-19 (Kovid-19) ప్రభావం వల్ల జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ కార్పొరేట్ ఆదాయాలు 31 శాతం క్షీణించాయని ఇక్రా నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial year) తొలి త్రైమాసికంలో ప్రధానంగా తయారీ, పారిశ్రామిక, నిర్మాణ, వినియోగ కార్యకలాపాలపై పరిమితులు ఏర్పడ్డాయి.

దీంతో భారత కార్పొరేట్ రంగం (Indian corporate sector) ఆర్థిక పనితీరు దెబ్బతిన్నదని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ షంషేర్ దేవాన్ తెలిపారు. విమానయాన, హోటల్, రిటైల్, ఆటోమోటివ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వంటి రంగాలు అధికంగా ప్రభావితమయ్యాయి. ఎఫ్ఎంసీజీ (FMCG), వినియోగ వస్తువుల విభాగాలు తక్కువ ప్రభావాన్ని ఎదుర్కొన్నాయని దేవాన్ అన్నారు.

అయితే, ఆదాయాలు క్షీణించినప్పటికీ, కార్పొరేట్ లాభాలు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 3.6 శాతమే తగ్గాయని ఇక్రా పేర్కోంది. మొత్తం 489 కంపెనీల ఆర్థిక ఫలితాలను ఇక్రా రేటింగ్ ఏజెన్సీ విశ్లేషించింది. ఇదే త్రైమాసికంలో దేశ జీడీపీ 23.9 శాతం తగ్గిన అంశాన్ని ప్రస్తావించిన ఇక్రా, ఈ త్రైమాసికానికి ముందు మూడు త్రైమాసికాల్లో ఆర్థిక బలహీనత కారణంగా కార్పొరేట్ ఆదాయాలు తగ్గాయని గుర్తుచేసింది. ఆశ్చర్యంగా, జూన్ త్రైమాసికంలో అత్యధికంగా ఆదాయాలు తగ్గిపోయాయని నివేదిక పేర్కోంది.

Advertisement

Next Story

Most Viewed