డ్రాగన్ కు షాక్.. వరస పెడుతున్న దిగ్గజ కంపెనీలు

by Anukaran |   ( Updated:2021-11-04 00:44:31.0  )
డ్రాగన్ కు షాక్.. వరస పెడుతున్న దిగ్గజ కంపెనీలు
X

దిశ, వెబ్ డెస్క్ : కమ్యూనిస్ట్ కంచుకోట చైనా కు ఇప్పుడు బీటలు వాలుతున్నాయి. ఇంత కాలం ప్రపంచ ఉత్పత్తి రంగంలో తన దైన స్థానం తెచ్చుకున్న డ్రాగన్ కంట్రీ కి ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇంత వరకూ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల చాలా విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే చైనా నియంత్రిత ధోరణి అర్థమవుతుండటంతో మెల్లిగా ఒకదాని వెంట మరొకటి దేశం వదిలి వెళ్తున్నాయి. విదేశీ టెక్ దిగ్గజాలు కంపెనీ కార్యకలాపాలను తగ్గించుకుంటుండగా తాజా గా ఇదే జాబితాలోకి యాహూ కూడా చేరింది. చైనా ప్రభుత్వం ఇక్కట్లు తట్టుకోలేక అక్కడి మార్కెట్ నుంచి వైదొలిగింది.

‘చైనాలో పెరుగుతున్న నియంత్రిత విధానాల వల్ల మా వ్యాపార నిర్వహణ మరింత కఠినంగా మారింది అందువల్ల నవంబర్ 1 నుంచి మా సేవలు చైనాలో నిలిపివేస్తున్నాం’ అని కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలో చైనా మార్కెట్ పెద్దదే అయినప్పటికీ ప్రభుత్వం విధానాలు నచ్చక అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ చైనా మార్కెట్ నుంచి తప్పుకుంది. ఇక మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ అయిన నెట్ వర్కింగ్ ఫ్లాట్ ఫాం లింక్డ్ ఇన్ కూడా తమ సైట్ ను చైనాలో మూసి వేస్తు్న్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story