భయం..భయం..26 దేశాల్లో కరోనా

by Shyam |

రోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనా యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టినా ఏమాత్రం సత్ఫలితాలనివ్వడం లేదు. రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. హుబెయ్ ప్రావిన్స్‌లో 24 గంటల్లోనే కరోనా కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోవడతో చైనా భయం గుప్పిట్లో బతుకుతోంది. అదే సమయంలో ఒక్కరోజులోనే సుమారు 3,500 మందికి ఈ వ్యాధి సోకిందని బయటపడ్డ లక్షణాలు చెబుతున్నాయి. మరో 500 మందికి క్షణాల్లెక్కబెడుతున్నారు. గతంలో కేవలం 14 జిల్లాల్లో ఆంక్షలు విధించిన చైనా ఇప్పుడా ఆంక్షల్ని మరిన్ని నగరాలకు విస్తరించింది. తైఝౌ, హంగ్‌ఝౌలోని కొన్ని ప్రాంతాలు, నింగ్‌బోలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలపై చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. మరోవైపు హాంగ్‌కాంగ్‌లో తొలి మరణం నమోదైంది. వూహాన్ నుంచి స్పీడ్ రైల్లో కరోనాను ఒక వ్యక్తి మోసుకొచ్చాడని నిర్ధారించారు. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్‌లలో కరోనా కొత్తగా బయటపడింది. దీంతో చైనా ఇప్పటికి 26 దేశాలకు విస్తరించినట్టు అధికారులు నిర్ధారించారు.

దీనికి మందు?

ఈ వైరస్ కి ఔషధం కనిపెట్టేందుకు వివిధ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సార్స్, ఎబోలా వంటి జబ్బులకు ఇచ్చిన మందులు దీనిపై ఎలా పనిచేస్తాయన్నదానిని పరీక్షిస్తున్నారు. మరో వైపు యాంటీవైరల్ మందులు దీనిపై ఎలా పని చేస్తున్నాయన్నదానిని పరిశీలిస్తు్న్నారు. ఇంకోవైపు అమెరికాలో ఒక సంస్థ అభివృద్ధి చేసిన ఔషధాన్ని వినియోగించగా ఒకే ఒక్కరోజులో కరోనా అదుపులోకి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు.

భారత్ నుంచి చైనా ప్రయాణం

భారత్ నుంచి చైనా లేదా చైనా నుంచి భారత్ ప్రయాణాల్ని పూర్తిగా ప్రభుత్వం నియంత్రించింది. ముందుగా ఈ వీసాలను రద్దు చేసిన ప్రభుత్వం…తాజాగా ఇతర వీసాలను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది. భారత్ నుంచి చైనా ఎవరూ వెళ్లవద్దని, వీసాలు జారీ చేయడం లేదని తెలిపిన ప్రభుత్వం.. చైనా నుంచి భారత్ రావాలనుకుంటే మాత్రం అక్కడున్న భారత్ ఎంబసీలను సంప్రదించాలని సూచించింది. దౌత్య లేదా కాన్సులేట్ కార్యాలయాలు అందుకు ఏర్పాట్లు చేస్తాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed