- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేఎంసీలో కరోనా టెస్టులు షురూ!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ టెస్ట్‌లు కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో షురూ అయ్యాయి. ఇంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లావాసులు అంతు చిక్కని రోగాల నిర్ధారణకు హైదరాబాద్, పుణే నగరాలకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ఇటీవల కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ ఆధునిక సేవలు అందుబాటులోకి తేవాలని భావించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కోటీ 75 లక్షలతో కేఎంసీలో ‘వైరాలజీ’ ల్యాబ్ ఏర్పాటు చేసింది. స్వైన్ ఫ్లూ, డెంగీ లాంటి భయంకర వ్యాధులకు సంబంధించిన టెస్టులే కాకుండా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించిన టెస్టులు కూడా ఇక్కడే చేసే ఏర్పాట్లు చేసింది.
కేఎంసీలో వైరాలజీ ల్యాబ్..
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేసింది. ఇక్కడే మెడిసిన్ బోధన సైతం జరుగుతుండడంతో మెడికల్ టెస్టులు జరిపేందుకు వీలుంటుందని భావించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది. ల్యాబ్‌కు నోడల్ ఆఫీసర్‌గా డాక్టర్ జ్యోతితోపాటు ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు ల్యాబ్ అసిస్టెంట్లను నియమించింది. వీరికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇక నుంచి మెడికల్ టెస్టుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పనిలేదు. ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లావాసులు ఏ మెడికల్ టెస్టు చేసుకోవాలన్నా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌కు వస్తే సరిపోతుంది.
మెడికల్ కు సంబంధించిన అన్ని టెస్టులు ఒకే చోట చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రత్యేక టీంతో టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక హైదరాబాద్, పుణె లాంటి పట్టణాలకు షాంపిల్స్ కూడా పంపించాల్సిన పని లేదు. ఇక నుంచి అన్ని టెస్ట్ లు కేఎంసీ వైరాలజీ ల్యాబ్లోనే చేస్తారు.
కరోనా టెస్ట్ లు చేస్తాం – డాక్టర్ సంధ్య, ప్రిన్సిపల్, కేఎంసీ
కాకతీయ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన టెస్టులు కూడా చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధం చేశాం. కరోనా వైరస్ నిర్ధారణ చేసేందుకు ఇద్దరు ప్రొఫెసర్లు కాన్ఫరెన్స్‌కు వెళ్లారు. వారితోపాటు కొంతమంది సిబ్బంది అందుబాటులో ఉంటారు.
Tags : coronavirus test in kakatiya medical college, coronavirus tests, coronavirus, janata curfew