గబ్బిలాల నుంచే కరోనా?

by Shamantha N |
గబ్బిలాల నుంచే కరోనా?
X

రోనా కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ ఇప్పటి వరకు 25 దేశాలకు వ్యాపించింది. రోజురోజుకూ మృతులు, వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇప్పటివరకు చైనాలోని సముద్ర జీవుల విక్రయ మార్కెట్ నుంచి కరోనా కొత్త రకం వైరస్ ప్రబలిందని భావిస్తూ వచ్చారు. కానీ, కరోనా కొత్త రకం వైరస్‌కు, సెవర్ అక్యుట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్)కు చాలా దగ్గరి లక్షణాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. గబ్బిలాల నుంచి సార్స్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కరోనా వైరస్ కూడా అలాగే వ్యాపించి ఉండొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ ‌సోకిని వ్యక్తిని పూర్తిస్థాయిలో పరీక్షించగా సార్స్‌తో 89.1 శాతం పోలికలు బటయ పడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed