- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఇప్పుడు ముప్పై జాతులుగా విడిపోయిందా..?
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గత నాలుగు నెలల్లో తన రూపాన్ని మార్చుకుందా అంటే చైనీస్ శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. వూహాన్ నగరంలో గుర్తించిన ‘సార్స్-కోవ్ 2’ వైరస్ ఇప్పుడు ముప్పై కంటే ఎక్కువ జాతులుగా పరివర్తనం చెందినట్లు చెబుతున్నారు. అన్ని దేశాల్లో ఉన్న కరోనా వైరస్ ఒకటి కాదని.. వివిధ దేశాల్లో వేర్వేరు రూపాలతో కొవిడ్ – 19 పంజా విసురుతున్నట్లు తమ పరిశోధనలో తేల్చారు. కరోనా ఇలా రూపాలు మార్చుకోవడం వల్ల దీనిని నివారించడం కష్టంగా మారుతోందని శాస్త్రజ్ఙులు అంటున్నారు. దీన్ని మొత్తంగా రూపుమాపడంలో సమస్యలు తలెత్తవచ్చంటున్నారు. కరోనా ఇలా రూపాలు మార్చుకోవడం వల్ల అది మునుపటి కంటే మరింత ప్రమాదకారిగా తయారవుతోందని వారి అధ్యయనంలో తేలింది. చైనాలోని హాంగ్జవు ప్రావిన్స్‌లోని జెజియాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లి లాంజవాన్ తన సహచరులతో కలసి చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీళ్ల పరిశోధన కోసం కరోనా బారిన పడిన 1,264 మంది బాధితుల్లో 11 మంది నుంచి నమూనాలను సేకరించి వైరస్ రూపాంతరం గురించి పరిశోధనలు చేశారు. తొలుత సోకిన వ్యక్తిలోని వైరస్.. తర్వాత సోకిన వ్యక్తిలోని వైరస్‌లో చాలా మార్పులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడీ పరిశోధన ఆధారంగా వ్యాక్సిన్ తయారు చేయాలంటే మరికొన్ని రోజులు పడుతుందని.. కేవలం 30 జాతులుగానే ఉందా లేకుంటే మరిన్ని జాతులుగా విడిపోయిందా అనే విషయంపై కూడా కూలంకషంగా అధ్యయనం చేయనున్నారు.
Tags: coronavirus, pandemic, mutated, china, 30 variants