- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కరోనా
తమిళనాడు రాష్ట్రాన్ని కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరాన్ని కరోనా వైరస్ దిగ్బంధించింది. ఒక్క చెన్నైలోనే ఏకంగా 4900 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే సగం కేసులు ఉన్నాయి. పైగా వైరస్ ఐపీఎస్ అధికారులను సైతం వదలడం లేదు. చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహమ్మారి వైరస్ బారినపడ్డారు. దీంతో కోవిడ్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 190కి పెరిగింది. అలాగే చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్‌కు కూడా కరోనా సోకింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన అధికారులతో పాటు.. వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ విధించారు. మరోవైపు, చెన్నైలో ఉన్న కోయంబేడు మార్కెట్ కరోనా వ్యాప్తికి కేంద్రంగా మారిన విషయం తెల్సిందే. కోయంబేడు మార్కెట్ ప్రభావం ఒక్క చెన్నైలోనే కాకుండా ఇతర జిల్లాలైన చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం కనిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా దాని ప్రభావం ఉంది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చెన్నైలో 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురంలో 299 కేసులు నమోదయ్యాయి. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కేసులు నమోదైవున్నాయి.