- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్నెట్‌లో కరోనా మాయ
ప్రపంచమొత్తం ఇళ్లకే పరిమితమైంది. పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ సమయాల్లోనే ఇలాంటి వాతావరణం కనిపించేది. కోవిడ్ 19 కారణంగా స్కూళ్లు, మాల్స్, ఇతర సందర్శక ప్రదేశాలు మూతపడటంతో అందరూ ఇంట్లో ఇంటర్నెట్‌తో సహవాసం చేస్తున్నారు. ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వివిధ వెబ్‌సైట్లు కూడా ప్రత్యేకంగా క్వారెంటైన్ కంటెంట్‌ను విడుదల చేస్తున్నాయి. ఎలాగూ కరోనా కారణంగా సినిమాలు, సీరియళ్ల షూటింగ్ కూడా వాయిదా పడటంతో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి. అందుకే థియేటర్‌కి ముందే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల్లో విడుదల చేయాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులు ప్రత్యేకంగా క్వారెంటైన్ ప్లేలిస్టులు కూడా సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.
ఎంటర్‌టైన్‌మెంట్… ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్
ఇంట్లో కూర్చొని సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలు చూడటానికే జనాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్లు తమ మెదడుకు పదును పెట్టి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. హాలీడే సమయాల్లో క్రిస్మస్ సంబంధిత సినిమాలు వేసినట్లు ఇప్పుడు ఏకంగా వైరస్ ఆధారిత ఫిక్షన్ సినిమాలు ప్రసారం చేస్తున్నారు. ఇక కొన్ని పాశ్చాత్య వెబ్‌సైట్లు అయితే తమ ప్రీమియం కంటెంట్ వీక్షణ ధరలను కూడా తగ్గించాయి. అంతేకాకుండా ఈ సమయంలో విడుదల చేసే ప్రకటనలకు ఎక్కువ డిమాండ్ పెరుగుతుండటంతో కొత్త స్టార్టప్‌లు ఎదిగే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీడియో స్ట్రీమింగ్ సైట్లు ప్రకటనల సంఖ్యను నిడివిని కూడా పెంచినట్లు తెలుస్తోంది.
ఇక కోవిడ్ 19 గురించి అవగాహన తెలిపే కార్యక్రమాలకైతే లెక్కేలేదు. ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. అయితే ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు కట్టుబడే నిర్వహించాలని ఆదేశాలు ఉండటంతో క్రియేటివిటీకి కొంత అడ్డుకట్ట వేసినట్లయింది. ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో ఆన్‌లైన్ గేములదే హవా… ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు కూడా రేట్లను తగ్గించి ఆటగాళ్లను ఆకర్షిస్తున్నాయి. ఇంకా ప్రత్యేకంగా కొత్త లెవల్స్‌ను కరోనా ఆధారిత థీమ్‌లను కూడా ప్రెజంట్ చేస్తున్నాయి. దీంతో యువత వీటికి బానిసయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది.
ఎడ్యుకేషన్.. ఎడ్యుకేషన్… ఎడ్యుకేషన్
సినిమాలు, ఆటలతో సమయాన్ని గడిపే రకాలు కొంతమంది అయితే, కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఈ సమయాన్ని ప్రొడక్టివ్‌గా మార్చుకోవాలని ప్రయత్నించే రకం మరికొంతమంది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ వెబ్‌సైట్లు కూడా ఈ సమయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతూ విజ్ఞానాన్ని అందించే ఈ వెబ్‌సైట్లకు కూడా నిన్న, ఇవాళ బాగా సబ్‌స్క్రిప్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రోగ్రామింగ్ కోర్సులు, పిల్లల ఎడ్యుకేషన్ వీడియోలు, ఇతర కరోనా అవగాహన ఆధారిత ఎడ్యుకేషన్‌కి బాగా ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఇంటర్నెట్ లేకపోతే ఈ క్వారెంటైన్ పీరియడ్ చాలా బోరింగ్‌గా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. కుటుంబంతో కలిసి, గ్రామాల్లో ఎంజాయ్ చేయడానికి మించిన ఆనందం వీడియోల్లో, ఆటల్లో దొరకదని సంప్రదాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
tags : Coronavirus gossips in internet, coronavirus fake news in social media, coronavirus news, covid 19