- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫ్రికాలో కరోనాతో 1.9 లక్షల మంది చనిపోయే ప్రమాదం
వాషింగ్టన్ : కరోనా వైరస్ కారణంగా ఆఫ్రికా ఖండానికి పెను ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కొనసాగితే.. రాబోయే సంవత్సర కాలంలో 2.9 కోట్ల నుంచి 4.4 కోట్ల మందికి కొవిడ్-19 వ్యాధి సోకే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. సరైన కట్టడి చర్యలు తీసుకోకపోతే ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చని చెప్పింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో సరైన వైద్య సదుపాయాలు లేవని.. అంతేకాక అక్కడి ప్రజలకు వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉండటం వల్ల కరోనా కారణంగా బాధితులు పెరిగే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.
ఈ పరిస్థితుల్లో 1.9 లక్షల మంది కరోనా కారణంగా మరణిస్తారని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆ ఖండంలోని 47 దేశాల్లో ఉన్న పరిస్థితులను డబ్ల్యూహెచ్‌వో బృందం పరిశీలించి ఈ అంచనాకు వచ్చింది. ప్రజలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని.. సరైన ఆహారం తీసుకుంటూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించింది. లేదంటే కొవిడ్ – 19 ప్రజల జీవితంతో భాగమైపోతుందని హెచ్చరించింది. వ్యాక్సిన్ వచ్చే వరకు మనం నియంత్రణ పాటించాల్సిందేనని చెప్పింది.