- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనాను ఎలా గుర్తిస్తారు..?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ (కోవిడ్-19) యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా సోకిన వారిని ముందుగా గుర్తించేందుకు పలు యంత్రాలు ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. దీని ద్వారా వ్యక్తికి కరోనా సోకిందా లేదా అనేది తేల్చేస్తున్నారు. అయితే.. ఈ థర్మల్ స్క్రీనింగ్ అంటే ఏమిటి? థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనాను ఎలా గుర్తిస్తారు? అని చాలామందికి సందేహం కలుగుతుంది. దాని గురించి తెలుసుకుందాం..
బాడీ స్కానింగ్…
ఏదైనా అంటువ్యాధి బారిన పడిన వ్యక్తిని గుర్తించేందుకు ఆ వ్యక్తి శరీరాన్ని స్కానింగ్ చేస్తారు. ఆ ప్రక్రియలో కొన్ని తరంగాలు వెలువడుతాయి. వాటి సాయంతో ఆ మనిషికి సోకిన అంటు వ్యాధిని గుర్తించేందుకు అవకాశముంటుంది. ఆ ప్రక్రియనంతా థర్మల్ స్క్రీనింగ్ అంటారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓ వ్యక్తి స్కానర్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. అనంతరం ఆ సమయంలో ఆ వ్యక్తి శరీరంలో ఉష్ణోగ్రతను బట్టి వ్యాధి సోకిందా లేదా అనేది గుర్తిస్తారు. వ్యాధి సోకని వ్యక్తికి, సోకిన వ్యాక్తికి తేడా కూడా కనిపిస్తుంది. స్కానింగ్‌లో వ్యాధి స్పష్టంగా తెలుస్తుంది. స్కానింగ్ సమయంలో వ్యక్తి శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే అతడికి వ్యాధి సోకినట్లుగా భావించి వైద్య పరీక్షల కోసం పంపుతారు. సాధారణ వ్యక్తి శరీరంలో ఉష్ణోగ్రత, వ్యాధి సోకిన వ్యక్తి ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది. ఈ విధంగా థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనా అనుమానితుడిగా గుర్తించబడితే..ఐసోలేషన్ సెంటర్‌కు పంపి ట్రీట్‌మెంట్ ఇవ్వడం ప్రారంభిస్తారు.
Tags: thermal screening, virus, identify,