పుట్టినింట్లో కరోనా వ్యాక్సిన్

by vinod kumar |   ( Updated:2020-10-07 09:45:28.0  )
పుట్టినింట్లో కరోనా వ్యాక్సిన్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌ల క్లినికల్ పరీక్షలు చివరిదశకు చేరుకున్నాయనే వార్తలూ వినిపిస్తున్నాయి. కరోనా పుట్టిన చైనాలో మరో వ్యాక్సిన్ కూడా సురక్షితంగా ప్రయోగదశలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైనెస్ కంపెనీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ బయాలజీ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

తొలిదశ ప్రయోగాల్లో భాగంగా జరిగిన పరీక్షల్లో దుష్ప్రభావాలేమీ కనిపించలేదని పరిశోధకులు వెల్లడించారు. మరింత సమర్థవంతంగా పరీక్షించిన తర్వాత ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి వివరాలను మెడ్ఆర్‌క్సివ్ అనే మేగజైన్‌లో వెల్లడించనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ‘ఫేజ్ 1 ప్రయోగదశలో ఆరోగ్యవంతులైన వారిపై ఈ టీకా ఇవ్వగా, వారికి అలసట, తక్కువ స్థాయిలో నొప్పి, ఇంజెక్షన్ ఇచ్చిన చోట కొంత వాపు వంటి ప్రభావాలు కనిపించాయి. అయితే, క్లినికల్ పరీక్షల్లో ఇలాంటి ప్రభావాలు కనిపించడం సహజం. వ్యాక్సిన్ తీసుకున్న అందరిలో రోగ నిరోధక శక్తి పెరిగినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed