- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సత్యదేవుడి సన్నిధిలో కరోనా.. పురోహితులే అధికం
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కరోనా కలకలం రేపుతుంది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి సన్నిధిలో 300 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 39 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఒక్కసారిగా ఆలయంలో అలజడి నెలకొంది.
ఈవో త్రినాథ రావు దేవదాయశాఖ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈనెల 14 వరకు భక్తులకు దర్శనాలు నిలుపుదల చేయమని ఆదేశించారు. ఇప్పటివరకు ఆలయంలో 49 మందికి కరోనా సోకింది. కాగా, దేవస్థానంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 700మంది పని చేస్తున్నారు. వారిలో 300 మందికి సత్యగిరిపై హరిహరసదన్‌లో కొవిడ్ పరీక్షలు నిర్వహిం చారు. మిగిలినవారికి త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కరోనా సోకినవారిలో అధికంగా వ్రత పురోహితులు, అర్చకులు ఉండడం విశేషం.
Next Story