రూ.75లకే కరోనా టీకా..!

by vinod kumar |
రూ.75లకే కరోనా టీకా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రపంచాన్ని కల్లోలం చేస్తోంది. ఇంటాబయట ఎక్కడకు పోయిన వైరస్ వెంటాడుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతోంది. కరోనాపై పోరు సాగిస్తూనే పలు రకాల టీకాలను అందుబాటులోకి తెచ్చారు. అయితే మార్కెట్లో వీటి ధరలు వివిధ రకాలుగా ఉన్నాయి. డ్రగ్స్ కంపెనీలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరల్లో విక్రయిస్తున్నాయి. ప్రైవేట్లో వాటి ధర మరోలా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన టీకాలు మ్యూటెంట్లకు తగ్గట్టుగా పూర్తిస్థాయిలో రూపొందించలేదు. అయితే కొత్త మ్యూటెంట్ కరోనా మీద కూడా ఎంతో సమర్థవంతంగా పని చేసే టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ సైంటిస్టులు కరోనా వైరస్ కట్టడి కోసం కొత్త టీకాను తయారు చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న కరోనా మ్యూటెంట్ల మీద సమర్థవంతంగా పని చేయడంతో పాటు భవిష్యత్తులో వచ్చే మ్యూటెంట్ల మీద ఇది సమర్థవంతంగా చేస్తుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కొత్త కరోనా టీకా ఒక్కో డోసు కేవలం రూ.75కే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటం విశేషం. ఈ టీకా అందుబాటులోకి వస్తే కరోనాను సమర్ధవంతంగా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story