ఆస్ట్రాజెనెకాకు త్వరలోనే ఆమోదం : ట్రంప్

by Anukaran |
ఆస్ట్రాజెనెకాకు త్వరలోనే ఆమోదం : ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచదేశాలు విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసుల బాధితుల లిస్ట్‌లో ప్రపంచ పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. కరోనా వ్యాక్సిన్ తయారీకి చాలా దేశాలు నిరంతం శ్రమిస్తున్నాయి. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్‌ తయారీ చేసినట్లు ప్రకటించుకోగా, చైనా వ్యాక్సిన్ ట్రయల్స్ తుదిదశకు చేరుకుందని తెలిపింది.

తాజాగా అమెరికా తయారీ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశకు చేరుకున్నాయని..దీనికి త్వరలోనే తుది ఆమోదం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇప్పటికే ఆఖరి దశకు చేరుకున్న టీకాల సరసన ఆస్ట్రాజెనెకా కూడా చేరింది. అసాధ్యం అనుకున్న దానిని అమెరికా సుసాధ్యం చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.

2021 జనవరిలోగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, అమెరికాలో 30వేల మందిపై ఈ టీకా ట్రయల్స్ జరుగుతున్నాయని ఆస్ట్రాజెనెకా తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed