ప్ర‌గ‌తి‌భ‌వ‌న్‌‌ టూ కొత్తగూడెం వెళ్లిన కరోనా

by Anukaran |
ప్ర‌గ‌తి‌భ‌వ‌న్‌‌ టూ కొత్తగూడెం వెళ్లిన కరోనా
X

దిశ‌, కొత్త‌గూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని పోలీస్ బెటాలియన్ లో 12 మందికి శ‌నివారం ఉద‌యం కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. హైదరాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో బందోబస్తు విధులు నిర్వహించి శుక్ర‌వారం బెటాలియ‌న్‌కు చేరుకున్న సిబ్బందికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 12మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. మ‌రికొంత‌మందికి కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి క్వారంటైన్‌కు త‌ర‌లించారు. పాజిటివ్ కేసుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్య వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. బెటాలియ‌న్‌లో శానిటైజేష‌న్ ప‌నులను అధికారులు విస్తృతం చేశారు. ప్ర‌స్తుతం బారక్ లొనే 12 మంది రోగుల‌కు చికిత్స అంద‌జేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed